NTV Telugu Site icon

Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై సీఎం చంద్రబాబు ఫోకస్..

Asha Workers

Asha Workers

Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరుతో పాటు గరిష్ట వయోపరిమితిని అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆశా వర్కర్ల అందరికీ ప్రయోజనం చేకూర్చేలా నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లించడం చేయనున్న చంద్రబాబు సర్కార్.

Read Also: Dilruba: “దిల్ రూబా” సినిమా నుంచి ‘కన్నా నీ..’ లిరికల్ సాంగ్ విడుదల

ఇక, ప్రస్తుతం నెలకు రూ.10,000 వేతనం ఆశా వర్కర్లు పొందుతున్నారు. వారి సర్వీస్ ముగింపు సందర్భంగా గ్రాట్యుటీ కింద సుమారు రూ.1.5 లక్షలు అందే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 37,017 మంది, పట్టణ ప్రాంతాల్లో 5,735 ఆశా వర్కర్లు విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.