Site icon NTV Telugu

Pensions Distribution: పెన్షన్ల పంపిణీలో రగడ.. ఎమ్మెల్యే వర్సెస్ శాప్ ఛైర్మన్

Pagidyala 1

Pagidyala 1

ఏపీలో వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ వేగంగా జరుగుతోంది. అయితే అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నంద్యాల జిల్లా పగిడ్యాలలో కొత్త పెన్షన్ల పంపిణీ లో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే ఆర్థర్ ముందే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సిద్ధార్థ రెడ్డి అనుచరుడు పుల్యాల నాగిరెడ్డి, ఎమ్మెల్యే అనుచరుడు జయరామి రెడ్డి మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం ఏర్పడింది.

Read Also:HIT 2: అడివి శేష్ ‘హిట్ 2’ మూవీ ఒటీటీలోకి వచ్చేసింది కానీ…

నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎమ్మెల్యే ఆర్థర్ సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత జయరామిరెడ్డిని ముచ్చుమర్రి పీఎస్ కు పిలిపించారు ఎస్ ఐ నాగార్జున. ముచ్చుమర్రి పి ఎస్ కు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఎమ్మెల్యే వర్గీయుల కారుపై రాళ్లు వేసి అడ్డుకొని ఇద్దరినీ చితకబాదారు నాగిరెడ్డి వర్గీయులు..సిద్ధార్థ రెడ్డి వర్గీయుల దాడిలో గాయపడ్డ జయరామిరెడ్డిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు,పోలీసులు. ఈ ఉదంతంతో వైసీపీ నేత విభేదాలు రచ్చకెక్కాయి. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన కార్యకర్తల్లో ఏర్పడింది.

Read Also: Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..

Exit mobile version