Site icon NTV Telugu

మద్యం మత్తులో యువకులతో పోలీస్ ఘర్షణ…

విశాఖ మేఘాద్రి రిజర్వాయర్ దగ్గర మద్యం మత్తులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశాఖ నగరానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పి .అశోక్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ జరుపుకొని, మేఘాద్రి రిజర్వాయర్లో ఈతకు దిగి, గోపాలపట్నం 89 వ వార్డు ప్రాంతానికి చెందిన యువకులతో ఘర్షణ పడి కొట్లాటకు దిగారు. అక్కడ గొడవ సద్దుమణిగి కొత్తపాలెం ప్రాంతానికి చెందిన యువకులు భగత్ సింగ్ నగర్ వద్ద కాపు కాసి దాడి చేసారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన యువకులను కేజీహెచ్ కి తరలించారు. అయితే తరచుగా మేఘాద్రి రిజర్వాయర్లో మందు పార్టీలు, ఘర్షణలు జరుగుతున్న రిజర్వాయర్ సిబ్బంది గాని, కాపు కావలసిన పోలీసులు గాని పోలీసులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావతం అవుతున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇరువర్గాల పై గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version