Site icon NTV Telugu

Ganesh Immersion: గణేష్‌ నిమజ్జనంలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

Pond

Pond

Ganesh Immersion: గణపయ్యకు పూజలు నిర్వహించిన భక్తులు.. మూడు రోజులు, ఐదు రోజులకు ఇలా నిమజ్జనం చేస్తున్నారు.. ఆట పాటలు, డబ్బు వాయిద్యాలతో గణపయ్యను సాగనంపుతున్నారు.. అయితే, గణపయ్య గంగమ్మ ఒడికి చేరే సందర్భంలో పాలు చోట్ల విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.. తాజాగా, చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.. అయితే, నిమజ్జనం ముగించుకుని గ్రామానికి చేరుకుంది మిత్ర బృందం.. కానీ, ఇద్దరు మిత్రులు కనపడకపోవడంతో చెరువు వద్దకు వెళ్లి వెతికే ప్రయత్నం చేశారు.. విగత జీవులైన ఇద్దరి మిత్రుల మృతదేహాలను బయటకు తీశారు గ్రామస్తులు.. దీంతో, ఆ గ్రామంలో విషాదం నెలకొంది.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.. గణేష్ నిమజ్జనం సమయంలో.. తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు..

Read Also: The Hundred 2025: మరోమారు విజేతగా అంబానీ టీం.. అల్లకల్లోలం సృష్టించిన విల్ జాక్స్!

Exit mobile version