NTV Telugu Site icon

Madanapalle Market: టమాటా రైతు కంట నీరు.. పంటను పొలాల్లోనే వదిలేయాల్సిన పరిస్థితి..!

Tomato Price Drop

Tomato Price Drop

Madanapalle Market: టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లు కదలుతున్నాయి.. మూడు నెలలపాటు శ్రమిస్తే వారికి నష్టాలే మిగిలాయి. ఆరుగాలం కష్టపడిన టమాటా రైతులు మద్దతు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాడు. చేతికొచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలులేక కొందరు తోటలోనే వదిలేస్తుంటే.. కూలీలను పెట్టించి కోయించినా గిట్టుబాటు ధర రావటంలేదని మరికొంత మంది రైతులు వాపోతున్నారు. టమోటా విక్రయాలలో పెద్ద మార్కెట్ గా పేరొందిన మదనపల్లె మార్కెట్ లో రైతులకు ప్రస్తుతం ధరలు లేక అల్లాడుతున్నారు. గత మూడేళ్లుగా టమాటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు.. ధరలు ఎప్పుడు పెరరుగుతాయో ఆశగా అని‌ ఎదురు చూస్తున్నారు. మదనపల్లె డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమోటా సాగు చేస్తున్నారు.

Read Also: Hydra Prajavani: నేడు బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి!

ఇక మదనపల్లె మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, ఉత్తారాది రాష్ట్రాలైన ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర మార్కెట్లు టమోటా ఎగుమతి అవుతోంది. ‌నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు టమోటా ఎగుమతి చేస్తారు. కాగా, నెల క్రితం‌ టమోటా కిలో 80 రూపాయిల వరకు ధర‌ పలికింది. బయట ప్రాంతాలలో కూడా టమోటా సాగు అవుతుండటంతో మదనపల్లె మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. రెండు వారాలుగా నాణ్యమైన టమోట కిలో ఐదు రూపాయలు పలుకుతుండగా నాణ్యత లేని రెండో రకం టమోటా కిలో రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది.. ఉన్న పంటని ఎమీ చేసుకోవాలో తెలియక అయోమయంలో పడుతున్నారు రైతులు.. పక్కన ఉండే తమిళనాడులో సైతం టమోటా ససాగు ఎక్కువ కావడంతో అటునుండి ఎవరు టమోటాలు కోసం ఏపీకి రావడం లేదు.. ఇక అయితే మార్కెట్ కు టమోటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు కనీసం ట్రాన్స్ పోర్ట్, కూలీ ఖర్చులుకు కాదు కధ.. తిరుగు ప్రయాణం చార్జీలకు కూడా రావడం లేదని టమోటా రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Read Also: Jail Superintendent Corruption: జైలు సూపరింటెండెంట్ అవినీతి బాగోతం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి..!

గత రెండెళ్ళుగా కరోనా కాటు వేస్తే…ఈ ఏడాది అయినా ఓ నాలుగు డబ్బులు సంపాదించుకుందామని ఆశ పడ్డా టమోటా రైతుల ఆశలను అవిరిచేశాయి మార్కెట్ ధరలు.. ఇక ఆరుగాలం శ్రమించి, పండించిన పంటను మార్కెట్ కు తీసుకు వస్తున్న రైతుకు ఇక్కడ తీవ్ర నిరాశ ఎదురవుతోంది. టమోటా కొనుగోలుకు బయటి వ్యాపారులు రావడం లేదు. కష్టపడి పండించిన పంటను ఎవ్వరూ కొనడానికి రాకపోవడంతో టమోటా రైతులకు కన్నీళ్లే మిగులుతుంది. ఎంతో వ్యయప్రయాసలు పడి మార్కెట్టుకు తీసుకొస్తున్న టమోటాను.. చివరకు ఏమి చేయాలో తెలియక అక్కడే పారబోసి ఉసూరుమని రైతులు వెనుతిరుగుతున్నారు.కూలీ, రవాణా ఖర్చులూ దండగేనంటూ.. చాలామంది రైతులు పొలాల్లోనే పంటను వదిలేయాల్సిన నిస్సహాయత నెలకొంది. పంట బాగా బాగా రావడంతో రికార్డు స్ధాయిలో పంటను రైతులు మదనపల్లెకీ తీసుకువస్తున్నారు.పోటి కారణంగా ధరలు పడిపోతున్నాయాని సమాచారం ధరలు లేక కుంగిపోయాయి తమకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కల్పించాలని కోరుతున్నారు..