AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Videos Political War: రోజు రోజుకీ టెక్నాలజీ అప్డేట్ అవుతుంది.. అది కూడా అందిపుచ్చుకుంటున్నారు రాజకీయ నేతలు.. ఇప్పుడు అంతా ఏఐ వీడియోల కాలం నడుస్తుండగా.. మేమేం తక్కువ అన్నట్టు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు గుప్పించుకోవడానికి కూడా ఏఐ వాడేస్తున్నారు.. ఇక, చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీయ పోరు కొత్త రూపు దాల్చింది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నేతలు ఏఐ వీడియోలతో పరస్పరం విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
వైసీపీ ఇన్చార్జి విజయానందరెడ్డి, ఆయన అనుచరులపై ఆరోపణలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే గురజాల వీడియో పోస్టు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక, భూ దందాలతో కోట్లు దోచేశారని.. అక్రమ లిక్కర్ వ్యాపారం చేశారంటూ అందులో ఆరోపణలు చేశారు. దీనికి వైసీపీ సోషల్ మీడియా నుంచి ఘాటైన కౌంటర్ వచ్చింది. ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ‘బటర్ బన్ను ఎమ్మెల్యే’ అంటూ ఏఐ వీడియోను రూపొందించింది. రెండేళ్లుగా చిత్తూరు ఎమ్మెల్యేగా ఉంటూ భూములు, ఇసుక, గ్రావెల్, గ్రానైట్ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేసింది. టోకెన్ అడ్వాన్స్‌ల పేరుతో భూములు కబ్జా చేస్తున్నారంటూ వైసీపీ వీడియోలో విమర్శలు చేసింది.వ్యక్తిగత విమర్శలతోపాటు వారి వారి అనుచరులు చిట్టా ఇరు పార్టీలు బయట పెట్టాయి.. దీంతో చిత్తూరులో రాజకీయ విమర్శలు ఇప్పుడు బహిరంగ సభలు, ప్రెస్ మీట్లను దాటి ఏఐ వీడియోల రూపంలో సోషల్ మీడియాలోకి చేరాయి. ప్రస్తుతం ఈ విడియోలు వైరల్ గా మారాయి…
Also Read
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
తాజావార్తలు
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?