Site icon NTV Telugu

Swiggy Boy Delivery Ganja: గంజాయి డోర్‌ డెలివరీ.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ అరెస్ట్..

Swiggy Boy

Swiggy Boy

Swiggy Boy Delivery Ganja: గంజాయి ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అరెస్ట్‌ చేశారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. కొర్లగుంట మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద ఉదయం నిఘా ఉంచి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన సత్తుపతి శ్రీనివాసరావుగా గుర్తించారు. అతను స్థానిక మారుతీనగర్‌లో ఉంటూ.. స్విగ్గీ బాయ్ గా పనిచేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన యువకుడు అక్రమ సంపాదన కోసం గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పూనుకున్నాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి తీసుకొచ్చే పరిచయస్తుల ద్వారా కిలో 10 వేలకు కొనుగోలు చేస్తాడు. చిన్న చిన్న ప్యాకెట్లు చేసి 300 చొప్పున తిరుపతి, రేణిగుంట ప్రాంతాల్లో విక్రయిస్తాడు. యువతను మత్తుకు బానిసలుగా మార్చుతూ వారి జీవితాలను నాశనం చేస్తున్నాడు. అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికే తీసుకెళ్లి అందిస్తున్నాడు. స్విగ్గీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. నిఘా పెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

Read Also: Dhanush: ధనుష్ పై నిషేధం ఎత్తివేత..

Exit mobile version