MLA Bojjala Sudheer Reddy: హత్యకు గురైన డ్రైవర్ రాయుడు పాత వీడియో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.. డ్రైవర్ రాయుడు వీడియోపై స్పందించిన జనసేన మాజీ నాయకురాలు వినుత కోటా.. రాయుడు చావులో మా ప్రమేయం లేదు.. కాబట్టే మాకు కోర్టులో బెయిల్ వచ్చిందన్నారు.. మేం ఫారిన్లో లక్షల జీతాలున్న ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదన్నారు.. నాపై జరిగిన కుట్రకు సంబంధించిన ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు వినుత కోటా.. అయితే, డ్రైవర్ రాయుడు వీడియో, వినుత కోట వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు శ్రీకాళహస్తి ఎమ్మల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.. అయితే, రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలి.. నేను ఎటువంటి విచారణకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు.
అయితే, కావాలనే నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.. నాకు రాయుడు తెలియదు.. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాను అన్నారు సుధీర్‌రెడ్డి.. న్యాయవాదులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం.. డ్రైవర్ వీడియో నమ్మేలా లేదు.. చంపడానికి ముందు బెదిరించి రికార్డు చేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్ పై పార్టీ అధిష్టానానికి వివరిస్తాను.. మా కుటుంబం 45 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తుంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పటి వరకు మేం ప్రజల్లో ఉన్నాం.. నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మాకు మంచి పేరు ఉంది. 2019 లో జనసేన పార్టీ నుంచి కోట వినుత పోటీ చేసి డిపాజిట్ కూడా రాలేదు.. ఆ రోజు మాకు 70,000 పైగా ఓట్లు వచ్చాయి.. 2024లో కూటమి ప్రభుత్వం తరఫున టికెట్ నాకు వచ్చింది.. కష్టపడి పని చేసాం.. మోడీ, అందరి ఆశీస్సుల వల్ల మంచి మెజారిటీతో గెలిచాం.. ఎప్పుడు ఎన్నడు లేని విధంగా కాళహస్తిలో పరిస్థితులు మారాయి అన్నారు.
Read Also: KTR : ఒక్కో బూత్‌లో 50 ఓట్లు దొంగ ఓట్లు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
కోట వినుత దంపతులు వాళ్ల డ్రైవర్ ను హత్య చేశారని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. నిన్న నాలుగు గంటలకు నాకు ఒక వీడియో వచ్చింది.. అదే హత్య చేయబడ్డ డ్రైవర్ రాయుడు వీడియో.. ఈ వీడియో ఏఐ దా లేక చంపడానికి ముందు వీడియో తీసి హత్య చేశారా? అని అనుమానం వ్యక్తం చేశారు.. హత్య జరిగి రెండు నెలలు దాటింది.. కోట వినుత దంపతులు జైలుకు కూడా పోయారు.. ఇప్పుడు వీడియో రిలీజ్ చేయడంలో దీని వెనక ఏముందో అర్థమవుతుంది అన్నారు.. నాపై బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.. డిపాజిట్లు రానివాళ్లతో నాకేంటి సంబంధం? అని ప్రశ్నించారు.. ఈ విషయంలో ఏ రోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు వాళ్ల గురించి ఎన్నడూ చెడ్డగా మాట్లాడలేదు.. ఈరోజు మాట్లాడాల్సి వచ్చిందననారు. కూటమి ప్రభుత్వం కోసం వినుత ఏనాడు పని చేయలేదన్న ఆయన.. పైగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది.. మా అమ్మ ఓటు అడిగేందుకు వెళ్తే ఇంట్లోకి కూడా రానివ్వలేదు.. రాజకీయ చరిత్ర ఉన్న మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది.. ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తే ఎవరిని వదిలి లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలి.. ఇవాళ నాపై బురద జల్లారు రేపు మరొకరిపై బురద చల్లుతారు.. ఇలాంటి చిల్లర రాజకీయాలు ఎన్నడూ చేయలేదన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి..