Red Sandalwood Smuggling: ఎర్రచందనం చెట్లను ఎలా నరకాలి.. వాటికి ఓ చోటికి ఎలా చేర్చాలి.. అక్కడి నుంచి ఫారెస్ట్ అధికారులు, పోలీసుల కళ్లు గంపి.. ఎలా తరలించాలి.. ఇలా కొత్త ఐడియాలు ‘పుష్ప’ సినిమాలో చూపించారు.. ఆ తర్వాత పుష్ప సినిమాలోని సీన్ల తరహాలో ఎన్నో స్మగ్లింగ్ ఘటనలు వెలుగు చూశాయి.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు.. ఉపయోగించిన టెక్నిక్‌తో.. అటు ఫారెస్ట్ అధికారులు.. ఇటు పోలీసులు నోరువెల్లబెడుతున్నారు..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీస్ స్టిక్కర్లు తమ వాహనాలకు వేసుకొని మరి స్మగ్లింగ్ చేస్తుండగా కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు.. వారి వద్ద నుండి దాదాపు 13 లక్షల రూపాయలు విలువచేసే 8 ఎర్రచందనం దుంగలను, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అటవీశాఖ అధికారులు.. స్వతగాహ అంబులెన్స్ డ్రైవర్లు కావడంతో రూట్లు తెలియడంతోపాటు వేగంగా నడిపే అలవాటు ఉండటంతో ఈజీ మనీ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు అరెస్టు అయినా ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్లు…
