NTV Telugu Site icon

Obscene dance in Ganesh Mandapam: వినాయక మండపంలో అశ్లీల నృత్యాలు.. కేసు నమోదు.. ఏడుగురి అరెస్ట్..

Obscene Dance

Obscene Dance

Obscene dance in Ganesh Mandapam: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు.. వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.. భజనలు, కోలాటాలు.. కీర్తనలతో భక్తి పారవశ్యంతో మునిగిపోతుంటారు.. అయితే, రానురాను ఇది శృతితప్పుందనే విమర్శలు ఉన్నాయి.. గణేష్‌ మండపాల దగ్గర సినిమా పాటలకు డ్యాన్స్‌ చేస్తున్నారు.. సరే.. ఇంత వరకు ఓకే అనుకున్నా.. రికార్డింగ్‌ డ్యాన్స్‌లు.. అవి మరింత ముదిరి అశ్లీల నృత్యాలకు దారి తీస్తోంది.. తాజాగా, తిరుపతిలో వినాయక చవితి ఉత్సవాలలో రికార్డింగ్ డాన్స్, అశ్లీల నృత్య ప్రదర్శనలు చేశారు.. అయితే, దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. అంతేకాదు.. 7 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు..

Read Also: AP Deputy CM: తెలంగాణ సీఎం రేవంత్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ..

తిరుపతిలోని సప్తగిరి నగర్ వినాయక స్వామి మండపం వద్ద సాంస్కృతికి కార్యక్రమాలు నిర్వహించారు నిర్వహకులు.. అయితే, సాంస్కృతికి కార్యక్రమాలు అంటే.. అలాంటి.. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావు.. రికార్డు డ్యాన్స్‌లతో హోరెత్తించారు.. అది కూడా వినాయకుడి మండపంలోనే.. ఇదంతా.. పక్కనే మరో స్టేజ్‌ కూడా లేకుండా.. వినాయకుడి మండపంలోనే.. యువతులతో రికార్డింగ్ డాన్స్ తరహాలో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు.. ఇక, అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు.. ఆ నృత్యాలను వీడియో తీసి.. సోషల్‌ మీడియాకు ఎక్కించడంతో.. వైరల్‌గా మారిపోయాయి.. ఈ ఘటనపై సీరియస్‌గా రియాక్ట్ అయిన ఎస్పీ సుబ్బారాయుడు.. ఘటనకు సంబంధించిన 7 మంది నిర్వాహకులైన జె. మధుసూదన్ రెడ్డి, ఎం. రాజేంద్రప్రసాద్, ఎం. వినోద్ కుమార్, జి. కిరణ్ కుమార్, జస్వంత్ రెడ్డి, పి. వినయ్, హేమంత్ లపై కేసులు నమోదు చేశారు.. ఆ తర్వాత అరెస్ట్‌ చేశారు..