MP Mithun Reddy Comments on Suspended YCP MLAs: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలను పూర్తి ఆధారాలతోనే వైసీపీ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిందని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను విభేదించిన వారికి ఓటమి తప్పదని, గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు పట్టిన గతే వీళ్లకూ పడుతుందని అన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు సీట్లు లేవని సీఎం ముందే చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు క్యారెక్టర్ లేని వ్యక్తి అని, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎన్టీఆర్‌ని ఎలా దించేశారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఎమ్మెల్యేల చెప్పారని.. అయితే జగన్ నిజాయితీగా సీటు ఇవ్వలేనని చెప్పారని అన్నారు. ఒక ఎమ్మెల్సీ కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని చెప్పారు. ఇదే సమయంలో.. చిత్తూరు జిల్లాలో పోటీ చేసే దమ్ము లోకేష్‌కు ఉందా? అంటూ ఎంపీ సవాల్ విసిరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు కచ్ఛితంగా గెలవాలన్న లక్ష్యంతోనే పని చేస్తామని వెల్లడించారు.
Kakani Govardhan Reddy: వాళ్లు ద్రోహం చేశారు.. అందుకే పార్టీ వారిని సస్పెండ్ చేసింది
ఇదే సమయంలో ఎంపీ మోపీదేవి సైతం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనైతిక విధానాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ వ్యవస్థను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. దొడ్డిదారిన గెలవడం, దొడ్డిదారిన అధికారంలోకి రావడం చంద్రబాబుకు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఓవైపు సీఎం జగన్ నైతిక విలువలతో రాజకీయాలు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు అనైతిక విధానాలతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల దాకా.. చంద్రబాబుది ఇదే పద్ధతని అన్నారు. వాపును చూసి చంద్రబాబు బలుపు అనుకుంటున్నారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగిస్తుందని, 2024లో కూడా జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని ఎంపీ మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు.
MLA Rapaka Varaprasad: టీడీపీ నాకు రూ.10 కోట్లు ఆఫర్ చేసింది.. ఎమ్మెల్యే రాపాక బాంబ్