Site icon NTV Telugu

Thomas: నారాయణస్వామిపై ప్రభుత్వ విప్‌ హాట్‌ కామెంట్స్‌.. అలా జరిగితే నేనైతే ఊరి వేసుకొని చచ్చిపోతా..!

Thomas

Thomas

Thomas: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హాట్‌ కామెంట్స్‌ చేశారు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే థామస్‌.. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారాయణస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారాయణస్వామి ఓ పిచ్చోడు, అవినీతిపరుడు అని విరుచుకుపడ్డారు.. సిట్ అధికారులు మీ ఇంటికొస్తే సాష్టాంగంగా వారి కాళ్లపై పడిపోయావు.. దీనికన్నా గలీజ్ ఏమైనా ఉందా? అని ఫైర్‌ అయ్యారు.. మేమైనా అవినీతి చేశామా, మేము ఏమైనా పోలీసులు కాళ్లు పట్టుకున్నామా..? అని ప్రశ్నించారు..

Read Also: Telangana Education Committee: తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనకు కమిటీ ఏర్పాటు.. కమిటీ సభ్యులు, విధివిధానాలు ఇవే!

అయితే, నువ్వు ఏమీ చేయకపోతే సిట్ అధికారులు ఎందుకు వస్తారు..? అని నారాయణస్వామిని నిలదీశశారు థామస్.. అయ్యా నాకేమీ తెలియదు ఎక్కడ సైన్ పెట్టమంటే అక్కడ పెట్టేసాను అంటావా‌..? అంటూ ఎద్దేవా చేశారు.. నారాయణస్వామి ఫోన్ నీ సిట్ అధికారులు తీసుకెళ్లారన్న ఆయన.. మాజీ డిప్యూటీ సీఎం ఫోన్‌ను సిట్ అధికారులు తీసుకెళ్తే దీనికన్నా పెద్ద అవమానం ఉంటుందా? అలా అవమానం జరిగితే నేనైతే ఊరి వేసుకొని చచ్చిపోతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 30 సంవత్సరాలుగా ఈ పనికిమాలిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం.. నేనైతే ఎక్కడ ఏ లెటర్ అయినా సొంతం కావాలంటే పెట్టేస్తా.. నారాయణస్వామి అయితే లెటర్ పైన సంతకం పెట్టాలంటే నాటుకోడి తీసుకురా.. వంకాయ తీసుకురా.. బెండకాయ తీసుకురా అని చెప్పేవాడు అంటూ సెటైర్లు వేశారు ఎమ్మెల్యే థామస్‌.. కాగా, ఏపీ లిక్కర్‌ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిని సిట్‌ అధికారులు విచారించిన విషయం విదితమే..

Exit mobile version