నేను ఎన్నికైన నాటి నుంచి నా మనసాక్షి ప్రకారం నడుచుకున్నాను అని చిత్తూరు వైసిపి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. వైసీపీ పార్టీ కార్యక్రమాలను అంకితభావంతో చిత్తశుద్దితో పూర్తి స్దాయిలో నిర్వహించాను.. గడప గడపకు వైసీపీ లాంటి పార్టీ కార్యకలాపాలలో చిత్తూరు మొదటి రెండవ స్దానంలో ఉన్నామని పార్టీ హైకమాండ్ తెలిపింది.. కానీ, పార్టీలో నాకు కొందరు సహకరించడం లేదంటూ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినా.. నన్ను వారించి చిత్తూరు సీటు నీకే అంటూ నమ్మబలుకుతూ వచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు యూనివర్శిటీ లాంటి సమస్యలు ఏకరువు పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు.. కాపు భవన్ కు నిధులు కేటాయించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.. చిత్తూరులో స్దానిక ఎమ్మెల్యేగా ఏమి చేయలేని స్ధితికి నన్ను జగన్ తీసుకువచ్చారు.. నా సొంత కంపెనీ ద్వారా చేసిన టెండర్ పనులకు 74 కోట్లు బిల్లులు నాకు పెండింగ్ లో ఉంది అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు.
Read Also: Sharwanand: అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వరాదే.. ఇప్పటికే మూడు అయ్యాయి
జగన్ సన్నిహితులకు మాత్రం బిల్లులు క్లియర్ చేస్తున్నారు అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమం, మంచి కార్యక్రమాలు జరిగింది.. నేను కాదనడం లేదు.. బస్సు యాత్రలో నన్నే అభ్యర్ధిగా పార్టీ పెద్దలు ప్రకటించి మాట తప్పారు.. డిసెంబరు 2న నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాని అని జగన్ అన్నారు.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి జనవరి 2న రాజ్యసభ అంటూ మభ్య పెట్టారు అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యసభకు నన్ను పంపి రాయలసీమ అంతటా నన్ను ప్రచారానికి వాడుకుంటామని మాట మార్చారు.. కొన్ని రోజుల తరువాత ఫిబ్రవరి ఆఖరిలో రాజ్యసభ లేదని తేల్చారు.. ఏపీఐఐసీ చైర్మెన్ పదవిని ఆశ చూపి ఆఖరికి అది కూడా ఇవ్వలేదు అని మండిపడ్డారు. బలిజల స్దానంలో రెడ్లను నిలిపారు.. రాజ్యసభ కూడా బలిజ, రెడ్ది, దళిత అని మొదట చెప్పి బలిజ ను తీసేసి రెడ్లకు మాత్రమే ఇచ్చారు అంటూ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Isha Ambani : లెహంగాలో ఇషా అంబానీ ఎంత అందంగా ఉందో చూశారా?
ఈ ఐదేళ్ళ కాలంలో ఒక్క కార్పొరేటర్ సీటును కూడా నా మనిషికి తీసుకోనీయలేదు అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ఈ పరిమాణాలన్నింటిలో విసుగు చెంది పవన్ కళ్యాన్ ను కలిసాను.. నన్ను సస్పెండ్ చేసారు.. నాలాగే పార్టీ లైన్ దాటిన రెడ్లపై ఇంత త్వరగా సస్పెండ్ చేయలేదు.. అందుకే నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా లేఖను పార్టీకి పంపుతున్నా.. రేపు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోబోతున్నాను తెలిపారు. బలిజలంటే జగన్ కు ద్వేషం.. నాకు గతంలో అండదండగా ఉన్న పెద్దిరెడ్డి నాపై చేసిన విమర్శలను పట్టించుకోను.. ఆయనను విమర్శించే స్దాయి నాకు లేదు.. కానీ, నాపై విమర్శలు చేస్తున్న ప్రస్తుత వైసిపీ అభ్యర్ధికి భవిష్యత్తులో సమాదానం చెబుతాను అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వెల్లడించారు.