NTV Telugu Site icon

YSRCP: చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడి మార్పు.. మాజీ మంత్రికి కీలక బాధ్యలు..!

Peddireddy

Peddireddy

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేజారిన తర్వాత.. కొందరు కీలక నేతలు సైతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరికొందరు కీలక స్థానాల్లో ఉన్న నేతలు సైతం.. అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.. దీంతో.. అలర్ట్‌ అవుతున్నారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినవారు.. తన నమ్మకస్తులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.. అందులో భాగంగా.. చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించేందుకు వైఎస్‌ జగన్‌ పూనుకున్నట్టుగా తెలుస్తోంది.. త్వరలో చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని మారుస్తారని తెలుస్తోంది.. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ ను కుప్పం నియోజకవర్గానికే పరిమితం చేయాలనేది అధిష్టానం ఆలోచనగా ఉందట..

Read Also: Terrorist Arrested: జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాది సహాయకుడి అరెస్ట్.. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం..

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 11 నియోజకవర్గాలకు కలిపి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.. కలసి కట్టుగా పార్టీనీ బలోపేతం చేయాలని, సమస్యలు వస్తే అందరూ కలసి వెళ్లాలని గురువారం జరిగిన చిత్తూరు జిల్లా వైసీపీ నేతలను సూచించారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌.. ఈ సమావేశంలోనే అధ్యక్షుడు మార్పు.. కొత్త అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్పు చేసిన జగన్‌.. ఇప్పుడు చిత్తూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల తరువాత జిల్లాలో పరిస్థితుల పైన ఆరా తీసిన ఆయన.. ఇదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై నేతల నుంచి అభిప్రాయం సేకరించారు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించాలని డిసైడ్ అయ్యారట.. చిత్తూరు జిల్లాలో తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు బాధ్యతలు తీసుకోవాలని పెద్దిరెడ్డికి సూచించారట వైఎస్ జగన్‌..