Site icon NTV Telugu

Fake Doctor: చిత్తూరులో నకిలీ డాక్టర్ కలకలం..

Fake Docter

Fake Docter

Fake Doctor: చిత్తూరు జిల్లాలో నకిలీ డాక్టర్ కలకలం రేపుతోంది. దశాబ్ద కాలంగా డాక్టరుగా చలామణి అవుతూ వచ్చిన ఆర్‌ఎంపీ డాక్టర్ అనేక మందిని మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన వీరాంజనేయులు మొదట ఆర్‌ఎంపీగా పని చేశాడు. కొన్నాళ్లకు గుంటూరులో డాక్టర్ కొత్త పెళ్లి కొడుకు అవతారం ఎత్తాడు. ఆ విషయం వెలుగు చూసిన తర్వాత తన పేరు రమేష్ బాబుగా మార్చుకుని చిత్తూరుకు పారిపోయాడు.

Read Also: CM Chandrababu: క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు సీఎం చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ

ఇక, చిత్తూరు నగరంలోని ఏకే అమ్మ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్‌గా పని చేస్తూ పలు శస్త్రచికిత్సలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. అంతే కాదు, దేశంలోనే అరుదైన ఓ శస్త్రచికిత్స చేశామంటూ మీడియా ద్వారా పబ్లిసిటీ కూడా చేసుకున్నాడు. చివరికి ఫేక్ డాక్టర్ అనే విషయం బయట పడటంతో నకిలీ వైద్యుడు రమేష్ బాబు పరారయ్యాడు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version