NTV Telugu Site icon

CM Chandrababu: రేపు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు సీఎం అందివ్వనున్నారు. అలాగే, పది సూత్రాలు భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించనున్నారు. ఇక, ప్రజా వేదిక సభ నుంచి స్థానిక ప్రజల్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. రామానాయుడు పల్లెలో స్థానిక టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకి తిరుగు పయనం కానున్నారు.