Site icon NTV Telugu

CM Chandrababu: అలా అయితే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తా.. చంద్రబాబు స్వీట్‌ వార్నింగ్..

Babu

Babu

CM Chandrababu: కుప్పం పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలని ఆకాక్షించిన ఆయన.. ప్రజలకు మంచి జరిగితే టీడీపీ కార్యకర్తే గుర్తుకు రావాలన్నారు.. ప్రజలకు దగ్గరైన వారు నాకు దగ్గరగా ఉంటారు.. లేదా, ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను.. కుప్పంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్మూలా అని స్పష్టం చేశారు చంద్రబాబు..

Read Also: Kakani Govardhan Reddy: కాకాణికి మళ్లీ షాక్‌.. మరో కేసులో రిమాండ్‌..

సుపరిపాలనలో తొలి అడుగు-ఇంటింటి ప్రచారం కార్యక్రమ నిర్వహణపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.. ప్రభుత్వ పనితో సమానంగా పార్టీ కోసం పని చేస్తున్నాను.. పనులు చేయడం ఎంత ముఖ్యమో.. చేసిన పనిని చెప్పుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నారు చంద్రబాబు… నేను మొదటి సారి కుప్పానికి వచ్చినప్పటి కంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు.. దాన్ని ప్రజలకూ తెలియచెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.. గత పాలకులు అరాచకాలు చేశారు.. 11కు పడిపోయారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పాం.. హామీలిచ్చిన విధంగా పని చేస్తున్నామని ప్రజలకు చెప్పాలి.. కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టినప్పుడు ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దండి.. గత ప్రభుత్వం పెన్షన్లల్లో కోత పెట్టింది. మనం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం. అభివృద్ధికి బ్రాండ్ టీడీపీ అయితే.. టీడీపీకి బ్రాండ్ కార్యకర్తలే అన్నారు. నేతలు అటూ ఇటూ మారుతున్నారేమో కానీ కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారు. డబుల్ సంక్షేమం చేస్తున్నాం.. ఫలితం కూడా డబుల్ ఉండాలనే రీతిలో కేడర్ పని చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు..

Read Also: Botsa Satyanarayana: బాబు, పవన్‌ ప్రశ్నిస్తే తాట తీస్తారట..! ఎందుకు నిలదీయకూడదు..?

ఇక, కుప్పానికి ఎయిర్ పోర్టు రాబోతోంది. అభివృద్ధిని అడ్డుకోవద్దు.. అన్నారు చంద్రబాబు.. మల్లప్పకొండ, నన్యాల్ వంటి వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేస్తున్నాం. హంద్రీ-నీవా నీళ్లు వస్తున్నాయి. భవిష్యత్తులో కుప్పంలో కరవు అనేదే లేకుండా చేస్తాం. పొలిటికల్ గవర్ననెన్స్ చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం అంతా కార్యకర్త ద్వారానే జరగాలన్నారు.. పార్టీ కోసం పని చేసిన వారికి.. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. టీడీపీది పెద్ద సైన్యం. ఎవరి పరిధిలో వారు చేస్తే అద్భుతాలు సాధించగలం. పాజిటివ్ పర్సెప్షన్ 5-6 శాతం పెరగాలి. లీడర్ షిప్ ట్రైనింగ్ కార్యక్రమాలు త్వరలో చేపడతాం అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

Exit mobile version