NTV Telugu Site icon

Chandrababu: కుప్పం నియోజకవర్గ మహిళలతో చంద్రబాబు ముఖాముఖి..

Chandrababu

Chandrababu

కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు.

Read Also: Kalki : కల్కి మీద కొత్త అనుమానాలు రేకెత్తించిన కమల్ హాసన్..?

ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. తనలాంటి వాడినే ఎన్నో సార్లు ఏడిపించారు… రాష్ట్ర ప్రజలను ఏడిపించి పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యను అవమానించారని.. మహిళలంటే వైసీపీకి గౌరవం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. కుప్పం ప్రజల ఆశీస్సులు కోసం వచ్చాను.. ఇక్కడికి వచ్చి ఫుల్ చార్జ్ అయి వెళతానని చంద్రబాబు పేర్కొన్నారు. చీకటి వ్యాపారాలు చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేశారు.. ఎన్నికలలో ఓట్ల కోసం వైసీపీ వాళ్ళు డబ్బులతో పాటు గంజాయి, డ్రగ్స్ కూడా ఇస్తారని దుయ్యబట్టారు. వైసీపీకి ఓటు వేస్తే కుటుంబానికి ద్రోహం చేసినట్లేనని చంద్రబాబు పేర్కొన్నారు.

Read Also: Tamil Nadu: మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రిపై కేసు నమోదు

ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఈ నెల 27 తేదీ నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం, సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపోందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు వరుస పర్యటనలు చేయనున్నారు.