మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నన్ను అంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఓ కేసు విషయంలో ఏలూరు జిల్లా కోర్టులో సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రైవట్ కేసు ఫైల్ చేసిన ఆయన… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఆరాచకాలపై కేంద్ర హోం శాఖ, గవర్నర్‌కి ఫిర్యాదు చేశామని వెల్లించారు చింతమనేని ప్రభాకర్.. భౌతికంగా నాపై దాడి చేసి అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: Sunil Deodhar: ఏపీలో పొత్తులు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన సునీల్ దియోధర్
ఇక, ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా సీఎం వైఎస్ జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌లపై మొబైల్ కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేసినట్టు తెలిపారు. మరోవైపు.. పార్టీ తరపున, వ్యక్తిగతంగా తనకు అనుకూలంగా వున్నవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు చింతమనేని ప్రభాకర్. కాగా, వైఎస్ జగన్ సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రతిపక్ష టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని.. వారిని ఏదో ఒక కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు ఉన్న విషయం తెలిసిందే.