Site icon NTV Telugu

Chintamaneni Prabhakar : కోడిపందాలు అంటే నాకు చిన్నప్పటినుంచి వ్యసనం..

Chintamaneni Prabhakar

Chintamaneni Prabhakar

ఇటీవల హైదరాబాద్‌ శివార్లలో కోడి పందాల నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే దాడిలో 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాకుండా పలువురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న వారినలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేనేని ప్రభాకర్‌ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. తాజాగా చింతమనేని ప్రభాకర్‌ దీనిపై స్పందిస్తూ.. పోలీసులకు, రెండు రాష్ట్రాల ప్రజలకు నేను కోడి పందాలు ఆడుతానని తెలుసని, కోడిపందాలు నాకు చిన్నప్పటినుంచి వ్యసనమని ఆయన వ్యాఖ్యానించారు. కోడి పందాలు ఆడటం చట్ట విరుద్ధమని, నా వీక్ నేస్ కొద్ది కోడి పందాలు ఆడటానికి వెళ్ళానన్నారు.

BIG C : బిగ్‌సీ లో ఆషాడం బంపర్‌ ఆఫర్‌.. రూ.1999 ఇయర్‌ బడ్స్‌ రూ.99కే

స్కెచ్ లో భాగంగా నన్ను కోడిపందాల వద్దకు తీసుకెళ్లారన్నా ప్రభాకర్‌.. కోడి పందాల వద్ద పోలీసులే నాకు సమాచారం ఇచ్చి అక్కడ నుంచి తప్పించారన్నారు. పోలీసులు వచ్చినపుడు నేను అక్కడ లేనని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే.. చాలా రోజులగా గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్‌ శివార్లలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైద‌రాబాద్ పోలీసులు నిఘా వేసి పందెం రాయుళ్లు కొందర్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 

Exit mobile version