NTV Telugu Site icon

Child Marriage: బాల్యవివాహం కలకలం.. సాయిబాబా గుట్టు రట్టు

Nandyal Child Marriage Issu

Nandyal Child Marriage Issu

Child Marriage In Nandyal District: అన్ని రంగాల్లోనూ పురుషులకు సమానంగా మహిళలు సత్తా చాటుతున్న ఈరోజుల్లోనూ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. డబ్బులకు అమ్ముడుపోయి.. జీవితం అంటే ఏంతో తెలియని బాలికలకు పెళ్లిళ్లు చేసేస్తున్నారు. మరికొందరు కామాంధులు మాయమాలు చెప్పి, బాలికల్ని తమ వలలో వేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి సంఘటనే నంద్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది.

Pakistan Economic Crisis: పాకిస్తాన్ దుస్థితి.. ఎన్నికల నిర్వహణకు కూడా డబ్బుల్లేవు..

కూతురు వయసున్న బాలికకు మాయమాటలు చెప్పి, ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ వ్యవహారంలో అతనికి ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించారు. చివరికి వీరి గుట్టు రట్టవ్వడంతో.. విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కంకోల్‌కు చెందిన సాయిబాబా (34) అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కోవెలకుంట్లకు వెళ్తున్న సమయంలో అతని కన్ను 13 ఏళ్ల బాలికపై పడింది. దీంతో.. ఆ బాలికకు మాయమాటలు చెప్పి, పెళ్లికి ఒప్పించాడు. అహోబిలంకు తీసుకెళ్లి, ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు.

Akshay Kumar: షూటింగ్‌లో అపశృతి.. అక్షయ్ కుమార్‌కి గాయాలు

ఈ విషయం ఆ నోట ఈ నోట చక్కర్లు కొడుతూ.. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) అధికారుల చెవిన పడింది. దీంతో వాళ్లు రంగంలోకి దిగి, పక్కా సమాచారాన్ని సేకరించారు. ఆ వ్యక్తి వివరాలతో పాటు పెళ్లికి సంబంధించిన వివరాల్ని సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు.. సాయిబాబాతో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుని విచారిస్తున్నారు.