NTV Telugu Site icon

ఆత్మ పరిశీలన అవసరం.. ఏపీ సీజే ఆసక్తికర వ్యాఖ్యలు

75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు ఏపీ సీజే అరూప్‌ గోస్వామి.. హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీజే అరూప్‌ గోస్వామి.. జాతీయ జెండాకు వందనం చేశారు.. ఈ కార్యక్రమానికి జడ్జీలు, ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం తదితరులు హాజరు కాగా.. ఈ సందర్భంగా జస్టిస్‌ అరూప్‌ గోస్వామి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవాన అంతా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.. స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగఫలాలను సద్వినియోగం చేసుకోవాలి.. నిత్యం స్మరించుకోవావాలి.. కుల, మతాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు.

నేషన్‌ ఫస్ట్‌.. అల్వేస్‌ ఫస్ట్‌ ఇదే నినాదంతో ముందుకెళ్లాలి అని సూచించారు జస్టిస్ అరూప్‌ గోస్వామి.. ఏడాదిన్నరగా కరోనాతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కోవిడ్‌ వల్ల అందరి జీవన విధానాలు మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. విద్యా సంస్థలు మూతపడ్డాయి.. జన జీవనం స్థంభించిందన్న ఆయన.. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని గుర్తుచేశారు.. ఇక, కోవిడ్‌ సమయంలో న్యాయ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొందని ఈ సందర్భంగా తెలియజేశారు జస్టిస్ అరూప్‌ గోస్వామి.