Chelluboyina Venu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చారు.. తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మోసం అర్థమైపోయిందన్నారు. ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు మాత్రమే పూర్తి సమయం వెచ్చిస్తుంది.. ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది.. కేవలం కక్ష సాధింపు కోసమేనా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం రూ. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన తర్వాత ఏడు లక్షలు కోట్లకు మాట మార్చారు.. చంద్రబాబు అబద్ధాల కోరు అని మళ్లీ నిరూపితమైంది.. తిరుమల లడ్డూను పరీక్షించకుండా కల్తీ జరిగిందని ప్రభుత్వం ఎలా చెప్పింది.. అధికారం అనే అతి పెద్ద బాధ్యతను విస్మరించి ప్రభుత్వం పాలను చేస్తుంది అని చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు.
Read Also: Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..
ఇక, ఇచ్చిన అబద్ధపు హామీలను నెరవేర్చకుండా వాటిని కప్పి పుచ్చుకునేందుకు మరిన్ని అబద్దాలు చెబుతున్నారు అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆరోపించారు. కక్ష సాధింపులే మీ సాంప్రదాయమా.. బీఎన్ఎస్ సెక్షన్ 111 ఈ కేసుకు ఎలా అన్వయిస్తారు అని అడిగారు. ప్రతిపక్ష నేత వెళ్లే వరకు గుంటూరు మిర్చి రైతులు మీకెందుకు గుర్తుకు రాలేదు.. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వెళ్ళాక గిట్టుబాటు ధర ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ప్రజా సమస్యలపై వెళితే అది అన్యాయమైన చర్యనా.. గత ప్రభుత్వం సాధించిన విజయాలను తమ ఘనతగా ప్రస్తుత సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అన్నారు. పోసానిని అరెస్ట్ చేసిన అంశంలో సెక్షన్ 111 అయనకు వర్తించదు.. పోలవరం ఎత్తు తగ్గించడం దారుణం.. ఎన్నికలకు ముందు అన్ని వస్తువులు తగ్గిస్తామన్నారు.. వచ్చిన తొమ్మిది నెలల్లోనే భారీగా ధరలు పెంచేశారు.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని వేణు గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు.