టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 23 (మంగళవారం) నుంచి ఏపీలోని వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. బుధవారం నెల్లూరులో ఆయన పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై శనివారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబు సమీక్షించారు.
Read Also: వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త
రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని కోరారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుని ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందులు పంపిణీ చేయాలని తెలిపారు. టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలను ఆదుకోవాలని చంద్రబాబు సూచనలు చేశారు.
