వరద బాధిత కుటుంబాలకు జగన్ శుభవార్త

ఏపీలోని వరద బాధిత కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త అందించారు. వరద ప్రభావిత జిల్లాలలో నిత్యావసర సరకుల పంపిణీకి ప్రభుత్వ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళాదుంపలను ఉచితంగా సరఫరా చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద బాధితులకు ఈ ఉచిత సాయం అందనుంది.

Read Also: ఏపీకి రాజధాని అమరావతి ఒక్కటే: సోము వీర్రాజు

ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ పర్యవేక్షించాలని జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సిన అవసరం లేదని జగన్ సూచించారు. ఈ మేరకు వారు ప్రజలకు తక్షణ సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. వరదల కారణంగా జరిగిన ఆస్తి నష్టం, పంట నష్టంపై అంచనాలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. మరోవైపు వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు వేసుకునేలా వాళ్లకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

Related Articles

Latest Articles