NTV Telugu Site icon

Chandrababu: తప్పుడు కేసులు పెట్టినవారిపై దర్యాప్తు చేయిస్తా..!

Chandrababu

Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. అయితే, ఇది కక్షపూరితమని ప్రతిపక్ష టీడీపీ మండిపడుతుంటూ.. ఆధారాలున్నాయి కాబట్టే కేసులు పెడుతున్నాం, అరెస్ట్‌లు చేస్తున్నామని చెబుతోంది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. బాదుడే బాదుడు పేరు నిర్వహిస్తోన్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ కుప్పంలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు.. తప్పుడు కేసులు పెట్టిన వారిపై దర్యాప్తు చేయిస్తా.. తప్పుడు కేసులు వెనుక ఏ స్థాయి అధికారి ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు చంద్రబాబు.

Read Also: Global Covid Summit- Modi: సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత.. డబ్ల్యూహెచ్ఓ రూల్స్ సరళం చేయాలి

ఇక, మహిళల మీద ఇష్టారాజ్యంగా దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.. నేను బాధితులను పరామర్శించడానికి వెళ్తే మహిళ కమిషన్ పేరుతో నా మీదే కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ మహిళ కమిషన్ ఏర్పాటు చేసిందే నేనంటూ గుర్తుచేసుకున్నారు. నాకే చట్టాలు నేర్పిస్తారా..? అంటూ మండిపడ్డారు.. తీవ్రవాదుల మీద పోరాడాను, అసాంఘిక శక్తుల గుండెల్లో నిద్రపోయాను… ఈ సీఎం తప్పుడు కేసులు పెడితే భయపడే వ్యక్తిని కాదన్నారు చంద్రబాబు నాయుడు.