NTV Telugu Site icon

Amaravathi: అమరావతికి శంకుస్థాపన జరిగి నేటితో ఏడేళ్లు.. ఫోటో పోస్ట్ చేసిన చంద్రబాబు

Chandrababu

Chandrababu

Amaravathi: సరిగ్గా ఏడేళ్ల క్రితం ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందన్నారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమైందని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Read Also: Psycho Injured Old Man: పలాసలో సైకో వీరంగం.. వృద్ధుడి తల పగులగొట్టి

అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పం. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడని మండిపడ్డారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని.. ఆంధ్రుల రాజధాని అమరావతే అని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని… 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని జోస్యం చెప్పారు. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని.. అమరావతే గెలుస్తుందని.. ఇదే ఫైనల్ అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ పడింది.