Site icon NTV Telugu

Chandra Babu: అనుమతుల పేరుతో వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు సరికాదు

Chandra Babu

Chandra Babu

Chandra Babu: ఏపీలో వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. వినాయక చవితి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదని చంద్రబాబు పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకం చేసి.. వారిలో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిన ఒక సామాజిక స్ఫూర్తి అని.. అటువంటి గణేష్ ఉత్సవాలపై అనుమతుల పేరుతో ఆంక్షలు సరికాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.

అటు వినాయక చవితి సందర్భంగా ఏపీ ప్రజలందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘గణనాయకుని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఆ విఘేశ్వరుడు మీ సంకల్పాలన్నిటినీ నెరవేర్చాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Exit mobile version