Site icon NTV Telugu

Chandrababu Tour: వరద ప్రాంతాల్లో నేడు, రేపు చంద్రబాబు పర్యటన

Chandrababu

Chandrababu

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈరోజు, రేపు గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు భరోసా కల్పించనున్నారు. కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, రాజోలు తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను చంద్రబాబు పరామర్శిస్తారు. ముందుగా రాజమహేంద్రవరం (Rajamahendravaram) వెళ్లి అక్కడి నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్తారు.

విలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించాలని భావించినా పరిస్థితులు అనుకూలించడం లేదని టీడీపీ వర్గాలు తెలిపాయి. గోదావరి వరద (Godavari Floods) ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందడంలేదని ఇప్పటికే టీడీపీ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ (Jaganmohan reddy) హెలికాప్టర్లో తిరిగితే సరిపోదంటున్నారు చంద్రబాబు. తమ ప్రభుత్వ హయాంలో విపత్తు నిర్వహణకు, ఇప్పటి అధికారుల నిబద్ధతకు తేడా ఏంటో చూడాలంటున్నారు చంద్రబాబునాయుడు.

మధ్యాహ్నం నాగుల్లంక నుంచి చంద్రబాబు వరద ప్రాంతాల పర్యటన ప్రారంభం అవుతుంది. ఉండవల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్దాంతం మీదుగా ఆచంట మండలం కోడూరు చేరుకోనున్నారు చంద్రబాబు. అనంతరం లంక గ్రామాలైన అయోధ్య లంక, కోనసీమ జిల్లాలోని నాగులంకకు పడవ లో చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కోనసీమ జిల్లాకు వెళ్లనున్నారు చంద్రబాబు. ఈనెల22వ తేదీన పాలకొల్లు, నర్సాపురం లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు.

బలహీనంగా ఉన్న ఏటిగట్లు పరిశీలించనున్నారు చంద్రబాబు. అటు యానాంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ వరదల్లోనే వున్నాయి. ఇటు గోదావరికి వరద తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద క్రమేపీ తగ్గుతున్న గోదావరి వరదతో లంక గ్రామాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 14.50 అడుగులకు తగ్గింది వరద నీటిమట్టం. బ్యారేజీ నుండి 13 లక్షల 94 వేల క్యూసెక్కులు వరదనీరు సముద్రం లోకి విడుదల చేస్తున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే వుంది. 13.75 అడుగులకు తగ్గితే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించనున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.

Drunk And Driving: పాతబస్తీలో మందు బాబు హల్చల్.. పోలీసుల ముందే ప్యాంట్‌ విప్పి మరీ..

Exit mobile version