కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని… సీఎం జగన్ బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందని… ఒకప్పుడు పేపర్లలో చూసి వెంటనే స్పందించిన సంఘటనలు తన జీవితంలో చాలానే ఉన్నాయని తెలిపారు. కరోనాతో అగ్ర దేశాలే వణికి పోతున్నాయని… కరోనాను అర్ధం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప.. దీనిని నివారించలేమని తాను మొదట్లో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
read also :పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సమాజాన్ని కాపాడేందుకు అనుక్షణం పని చేశానని… కరోనా రాకుండా నివారించడమే పరిష్కార మార్గమని చెప్పినా జగన్ రెడ్డి వినలేదని మండిపడ్డారు. కరోనా వైరస్ ఒకరిని నుంచి మరొకరకి వస్తుంది, జాగ్రత్త చర్యలు తీసుకో వాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తే నన్ను అవహేళనగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. అనేక రంగాల నిపుణులు, మేథావులతో మాట్లాడాను. పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా రాదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
