CM Jagan Birthday: ఏపీ సీఎం జగన్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘బర్త్ డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్‌లో విషెస్ పోస్ట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ పవన్ పేర్కొన్నారు. ఆ భగవంతుడు జగన్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు. అటు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ బర్త్ డే వేడుకల కోలాహలం నెలకొంది. అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం జగన్‌తో మంత్రులు, అధికారులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, తానేటి వనిత, విడదల రజని, జోగి రమేష్, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు కేక్ తినిపించారు.
Birthday greetings to @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2022
https://twitter.com/JanaSenaParty/status/1605479450174296064
