Site icon NTV Telugu

CM Chandrababu: రైతుల సహకారం మరువలేనిది.. అమరావతిని వినూత్నంగా నిర్మిస్తున్నాం!

Cm Chandrababu

Cm Chandrababu

ఇటీవలే ప్రధాని మోడీ వచ్చి అమరావతి పనులు పునఃప్రారంభించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2028 మార్చ్ నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు. అమరావతి రైతుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రాజధానికి కేంద్ర సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం రూ.15 వేల కోట్లు రాజధానికి ఇచ్చిందన్నారు. అమరావతిని వినూత్న నగరంగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు.

‘ఇటీవలే ప్రధాని మోడీ వచ్చి అమరావతి పనులు పునఃప్రారంభించారు. రాజధానిని కట్టాలని అనుకున్నప్పుడు ముందుకు వచ్చి రైతులు భూములు ఇచ్చారు. ప్రపంచంలో స్ఫూర్తి దయాకమైన ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి. 2028 మార్చ్ కల్లా అమరావతిలో పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం పని చేస్తుంది. కేంద్రం ఎప్పుడు అండగా నిలుస్తుంది. గత ఐదు సంవత్సరాలలో విద్వంసం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం ఇస్తున్న భరోసాతో రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి దిశగా ముందికి వెళ్తుంది. అమరావతిలో బ్యాంకుల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థగా అమరావతి మారబోతుంది. బ్యాంక్ నిర్మాణాల కోసం భూములు ఇస్తున్నాము, అదునాతన భవనాలు ఏర్పాటు కాబోతున్నాయి. 2014 వరకు దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఒక మహిళ ఎంతగానో కస్టపడి పనిచేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: Pawan Kalyan: దేశంలో ఓ అరుదైన ఘట్టం అమరావతిలో చోటుచేసుకుంది!

‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆస్ట్రోకు 5 ఎకరాల భూముని కేటాయించాము. అందులో ఒక ప్లానిటోరియం ఏర్పాటు కాబోతుంది. నూతన రాష్ట్రంలో అన్ని విధాలుగా బ్యాలన్స్డ్ చేయటం కోసం ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది. వెంటిలేటర్ మీద ఉన్న ఏపీని బయటకి తీసుకొచ్చిన ఘనత కేంద్రంది. అగ్రిటెక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేటెస్ట్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నాము. ఏరోస్పేస్, సెమికండక్టర్.. ఇలా అన్ని విధాలుగా భవిష్యత్ ఉండేలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాము. అమరావతిలో 56వేల కోట్ల పనులు జరుగున్నాయి. 2028 నాటికీ పూర్తి అవుతుంది. అమరావతికి 7 జాతీయ ప్రధాన రహదారులు అనుసంధానం అవుతున్నాయి. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ, దేశం గర్వపడేలా అమరావతి రూపుదిద్దుకుంటుంది. అన్ని ఫైనాన్స్ సర్వీసెస్ అమరావతి నుంచి ఆపరేట్ చేసేలా ఉంటుంది. CII సదస్సులో 36 సంస్థలతో ఒప్పందులు కుదుర్చుకున్నాము. 2047 కి దేశాన్ని ముందికి తీసుకెళ్లే దానిలో ఆంధ్రప్రదేశ్ ఘననియమైన పాత్ర పోషిస్తుంది. పోలవరంని రిస్ట్రక్చర్ చేయటంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిధులు కేటాయించి సహాయ సహకారాలు అందించారు. అమరావతి మీ అందరి సహకారంతో ఒక కొలిక్కి వస్తుంది’ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Exit mobile version