Site icon NTV Telugu

Chandrababu Naidu: ఏపీ క్షేమం కోసం టీడీపీ గెలవాలి

Chandrababu

Chandrababu

ఏపీలో వరుస ఛార్జీల పెంపుదలతో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బాదుడే బాదుడు పై వీడియో కాన్ఫరెన్సులో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం క్షేమం కోసం టీడీపీకీ అధికారం కావాలన్నారు చంద్రబాబు. టీడీపీకి అధికారం ఇప్పుడు చారిత్రిక అవసరం. రాష్ట్రం మిగిలి ఉండాలంటే.. టీడీపీ అధికారంలోకి రావాలి.

https://ntvtelugu.com/pawan-kalyan-assurance-to-koulu-rythulu/

టీడీపీ గెలుపు అనేది కేవలం పార్టీ కోసమే కాదు….రాష్ట్రం కోసం అవసరం. మిగులు విద్యుత్తుగా ఉండే రాష్ట్రంలో ఈ స్థాయి కరెంట్ కష్టాలకు జగన్ విధానాలే కారణం. మూడేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ. 16 వేల కోట్లు ప్రజల జేబులనుంచి లాక్కున్నారు. శ్రీలంక ప్రకటించినట్లు.. ఏపీ కూడా దివాళా తీసినట్లు జగన్ ప్రకటిస్తారేమో! రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలను చిదిమేసి.. ఇప్పుడు సామాజిక న్యాయం అంటారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయా వర్గాల ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా రెండు పదవులు ఇచ్చి సామాజిక న్యాయం అని ఎలా చెప్పుకుంటారు..?అని చంద్రబాబు మండిపడ్డారు.

Exit mobile version