NTV Telugu Site icon

Chandrababu Naidu: మీడియా కోఆర్డినేటర్ నరేంద్ర అరెస్ట్ పై డీజీపీకి చంద్రబాబు లేఖ

Chandrababu

Chandrababu

Chandrababu Naidu Letter To DGP :ఏపీలో పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu)పార్టీ మీడియా కో ఆర్డినేటర్ నరేంద్ర అరెస్టుపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. సుప్రీంకోర్టు అదేశాలకు విరుద్దంగా సిఐడి పోలీసులు వ్యవహరించారు…వెంటనే నరేంద్రను విడుదల చేయాలి అని లేఖలో పేర్కొన్నారు. టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రను సిఐడి పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సుమారు 7 మంది వ్యక్తులు రాత్రి సమయంలో నేమ్ బ్యాడ్జ్ లు కూడా లేకుండా నరేంద్ర ఫ్లాట్‌లోకి ప్రవేశించి, తాము సిఐడికి అని చెప్పి అతన్ని తీసుకువెళ్లారు.

Read Also: Bus Fire: బస్సులో చెలరేగిన మంటలు.. అగ్నికి ఆహుతైన 17 మంది ప్రయాణికులు

ఆరోగ్య సమస్యలు ఉన్న నరేంద్ర ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మొత్తం పోలీసు శాఖ బాధ్యత వహించాలి.ప్రతిపక్ష టీడీపీ నేతలు, క్యాడర్‌ను టార్గెట్ చేయడంలో సిఐడి పూర్తిగా నిమగ్నమైంది. సెక్షన్ 41A కింద నోటీసు ఇవ్వకుండా అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏముంది? ఇదే కేసులో అంకబాబును అరెస్టు చేసినందుకు కోర్టు సిఐడి పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసినవిషయం గుర్తులేదా?సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రాత్రి సమయంలో నరేంద్రను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటి? అని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

టీడీపీ కార్యాలయంపై వైఎస్‌ఆర్‌సిపి దాడి చేసి ఏడాది గడిచినా ఇప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.సిఐడి తనంతట తానే ఒక చట్టం అని భావిస్తుంది.వైఎస్సార్‌సీపీ ప్రతీకార రాజకీయాలకు సీఐడీ సహకారం విస్మయం కలిగిస్తోంది. అధికార పార్టీ ప్రయోజనాల కోసం సిఐడి దిగజారడం బాధాకరం.బాధితులను బెదిరించడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం కోసమే పోలీసులు ఈ తరహా అరెస్టులు చేస్తున్నారు.దారపనేని నరేంద్రను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ అరెస్టులు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నా అని డీజీపీ రాసిన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.

Read ALso: Karnataka Hijab Ban: హిజాబ్ నిషేధంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

Show comments