Site icon NTV Telugu

విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జ్‌గా కేశినేని నాని

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పదవిపై టీడీపీ అధినాయకత్వం స్పష్టతనిచ్చింది. ఎంపీ కేశినేని నానికి విజయవాడ పశ్చిమ బాధ్యతల అప్పగిస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జ్‌ పదవిని చివరి వరకు బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా ఆశించినప్పటికీ చంద్రబాబు కేశినేని వైపే మొగ్గు చూపారు. బుద్ధా, నాగుల్‌ మీరాకు ఇప్పటికే వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవిని కేశినేనినానికి అప్పగించారు.

https://ntvtelugu.com/dk-aruna-who-was-severely-fired-on-kcr/

నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని నానికి చంద్రబాబు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే బుద్ధా, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడ పశ్చిమలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కేశినేని నాని రావడంతో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయిని స్థానిక టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version