NTV Telugu Site icon

Chandrababu Naidu: మేం భయపడేదే లేదు. బుల్లెట్లా దూసుకెళ్తాం

Ncbn

Ncbn

ఏ మహానాడులోనూ ఒంగోలు మహానాడులో ఉన్నంత కసి చూడలేదు.ఉన్మాదుల పాలన నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కార్యకర్తలు తరలి వచ్చారు.మనకు జనాలు ఉన్నారు.. వారికి బస్సులున్నాయి.అధికారం పోతే ఆ బస్సులు కూడా వైసీపీకి ఉండవు. మహానాడును అడ్డుకునేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు.

మహానాడు వాహానాలకు గాలి తీసేస్తున్నారు.ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.జగనుకు ఈ రోజు పిచ్చెక్కుతుంది.జగనుకు ఇవాళ నిద్ర పట్టదు. వైసీపీ నేతలు వెల వెల.. టీడీపీ మీటింగులు కళ కళ.భవిష్యత్తులో ఎన్టీఆర్ రికార్డులను ఎవ్వరూ బద్దలు కొట్టలేరు.ఏడాది పాటు ఎన్టీఆర్ జయంత్యుత్సవాలు చేపడుతున్నాం.ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతాం.అఖండ సినిమాను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించారు.

బాలయ్య ప్రజలపై నమ్మకం ఉంచి సినిమా విడుదల చేశారు. సక్సెస్ అయింది.అది బాలయ్య అంటే..సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా..?సినిమా విడుదల చేయాలంటే మీ పర్మిషన్ కావాలా..?రేపు జగన్ కంపెనీ భారతీ సిమెంట్సుకు పర్మిషన్ ఇచ్చేది నేనే.ఛార్జీలన్నీ పెరిగాయి.. వీరబాదుడు బాధేస్తున్నారు.ప్రజలు అడగలేరనే ధైర్యం.ప్రజల జీవితాలతో ఆడుకునే ప్రయత్నం చేశారు.

ప్రజల తరపున మేం పోరాడుతోంటే.. మాపై వైసీపీ నేతలు నీచంగా మాట్లాడుతున్నారు.మేం భయపడేదే లేదు.బుల్లెట్లా దూసుకెళ్తాను. ఎన్ని కేసులైనా పెట్టుకో.మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలి గుర్తుంచుకోండి.రౌడీలను.. గూండాలను వదిలిగ పెట్టేదే లేదు. కుటుంబానికి లక్ష రూపాయల భారం పడింది. వైసీపీ మోసకారి సంక్షేమం అమలు చేస్తోంది.సంక్షేమం పథకాలు మొదలు పెట్టిందే ఎన్టీఆర్.చదువుకునే పిల్లలకు స్కాలర్ షిప్పులు ఇవ్వడం లేదు.

మూడేళ్లల్లో జగన్ అవినీతి రూ. 1.70 లక్షల కోట్లు.రూ. 8 లక్షల కోట్లు అప్పు చేశారు.ఓ కుటుంబంపై లక్ష రూపాయల భారం. రూ. 1.70 లక్షల కోట్లు జగన్ ఖజానాకు చేరాయి.ఏ రైతైనా బాగున్నారా..?రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. వైసీపీకే ఉరేయాలి.వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి.జగన్ ఆ అప్పులు తీరుస్తారా..?జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి.రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతారు.జగన్ అవినీతిని కక్కిస్తా.భూముల్లో భారీ అవినీతికి పాల్పడుతున్నారు.భూముల విషయంలో లిటిగేషన్లు పెట్టేసి అమ్మేస్తున్నారు.ప్రజలు తమ భూములను కాపాడుకోవాలన్నారు చంద్రబాబు.


అప్పుడు జగన్‌ని తిట్టి.. ఇప్పుడు జపం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

మహానాడుని ఎదుర్కొవడానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా.. కార్యకర్తలు చీమల దండులా తరలి వచ్చారన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఇది జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ. ఈ మహానాడు చూశాక 160 స్థానాలు ఖాయంగా కన్పిస్తోంది. ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏపీని ఓ క్రిమినల్ పాలిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారన్నారు. కులాలు, మతాల మధ్య తగువులు పెడతారు.టీడీపీ గెలుపు ఖాయమని అర్థమయ్యాక.. కోనసీమలో తన మంత్రి ఇంటినే తగులపెట్టుటించారు. కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు.మొన్నటి వరకు జగన్ను తిట్టిన బొత్స, ధర్మాన వంటి వారు ఇప్పుడు బస్ యాత్రలో వచ్చి టీడీపీని విమర్శిస్తూ.. జగన్ జపం చేస్తున్నారు.

Balakrishna: తెలుగు వెలుగు ఎన్టీఆర్