NTV Telugu Site icon

Andhra Pradesh: రైతు సమస్యలపై టీడీపీ ఉద్యమం.. సీఎం సొంత జిల్లా నుంచే మొదలు

Chandrababu

Chandrababu

అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన టీడీపీ నేతలతో చర్చించారు. తన పర్యటనలే కాకుండా.. పార్టీ పరంగా కూడా వివిధ సమస్యలపై కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. అయితే ముందుగా రైతు సమస్యలపై ఉద్యమిద్దామని టీడీపీ నేతలు సూచించారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భేటీలో నిర్ణయించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయంపై రైతుల్లో ఆందోళన ఉందని చంద్రబాబు దృష్టికి టీడీపీ నేతలు తీసుకువెళ్లారు. పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన మీటర్ల బిగింపు వ్యవహారాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని ఉత్తరాంధ్ర నేతలు వివరించారు.

Vijaya Sai Reddy: పబ్లిక్ స్థలాల్లో అన్నా క్యాంటీన్‌లు పెట్టి రచ్చ చేస్తారేంటి?

ఈ నేపథ్యంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సదస్సులు నిర్వహించాలని తలపెట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి రైతు పోరు బాట పేరిట టీడీపీ బహిరంగ సభలు నిర్వహించనుంది. ఐదు పార్లమెంటు స్థానాలలో ఓ ప్రాంతీయ సదస్సు చొప్పున ఐదు రైతు పోరుబాట సభలకు టీడీపీ సిద్దమవుతోంది. సీఎం సొంత జిల్లా కడప నుంచి టీడీపీ రైతు పోరుబాట సదస్సులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 20వ తేదీన కడప, 25వ తేదీన నెల్లూరు, వచ్చే నెల ఒకటో తేదీన కాకినాడల్లో టీడీపీ ప్రాంతీయ సదస్సులు జరగనున్నాయి. జూలై ఏడో తేదీన విజయనగరం, వచ్చే నెల 13వ తేదీన విజయవాడలో రైతు పోరు బాట సదస్సులను టీడీపీ నిర్వహించనుంది.