ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులపై చర్చలు మొదలయ్యాయి… జనసేన ఆవిర్భావి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభ వేదికగా పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటన చేయగా.. ఇప్పుడు.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇక, బీజేపీ నేతలు కూడా పలు సందర్భాల్లో పొత్తుల విషయంపై మాట్లాడుతూనే ఉండగా… మరోవైపు.. చరిత్రలో పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర అసలు టీడీపీకి ఉందా? అని నిలదీశారు.
Read Also: Minister Harish Rao : ఈ నెల 12న హాస్పిటల్స్ వద్ద ఉచితంగా భోజనం
అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు… ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాఉద్యమం రావాలని.. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. ఇక, ఈ పోరాటంలో తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధం అన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలపై కేసులు పెడితే ఎవరైనా భయపడతారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. టీడీపీ నేతలను అరెస్ట్ చేస్తే.. మీపై వ్యతిరేకత తగ్గుతుందా? మరింత రెచ్చపోతాం.. గట్టిగా పనిచేస్తాం అన్నారు చంద్రబాబు. మొత్తంగా.. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.