YS Jagan: తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి.. కేవలం, 9 నెలల్లో బడ్జెటరీ అప్పులే రూ. 80,820 కోట్లు అన్నారు. 9 నెలల్లో అమరావతి పేరు చెప్పి చేస్తున్న అప్పు రూ. 52 వేల కోట్లు.. APMDC ద్వారా మరో రూ. 5 వేల కోట్ల అప్పు… 9 నెలల్లోనే ఏకంగా లక్షా 40 వేల కోట్లపైనే అప్పులు చేశారని ఆరోపించారు. ఇన్ని అప్పులు చేసినా.. సూపర్-6 ఇచ్చారా, పేదలకేమైనా బటన్లు నొక్కారా.. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా.. అమ్మఒడి, రైతు భరోసా, వసతి దీవెన, విద్యాదీవెన, చేయూత, ఆసరా, వాహనమిత్ర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం లాంటి గతంలో ఉన్న అన్ని పథకాలు పోయాయంటూ వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Read Also: Ponnam Prabhakar: ఫ్లిక్స్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఇక, రూ. 1,40,000 కోట్ల అప్పులు ఎవరి జేబులోకి పోతున్నాయని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు కానీ.. 2 లక్షలకు పైగా వాలంటీర్ల ఉద్యోగాలు తీసేశారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్ని కూడా ఇతర శాఖల్లో సర్దేస్తున్నారు.. వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ఉద్యోగుల్ని అలాగే మోసం చేస్తున్నారు అని ఆయన తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్న చంద్రబాబు.. కానీ, ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అని చెప్పి.. ఉన్న పీఆర్సీ ఛైర్మన్ ను పంపించేశారని మండిపడ్డారు. ఏ నెలలో ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇచ్చారో చెప్పాలన్నారు. ఇప్పుడు జరుగుతున్నది.. ఆర్థిక విధ్వంసం.. మా హయాంలో 4 పోర్టులు కట్టాం.. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు చేశామని వైఎస్ జగన్ వెల్లడించారు.
Read Also: Prithviraj Sukumaran: మేము విజయం సాధించాం అనడానికి ఇదే నిదర్శనం : పుధ్వీరాజ్ సుకుమారన్
అలాగే, చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే.. తన ఆస్తి, తమవారి ఆస్తులు పెంచుకోవడమే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ఇసుక వల్ల రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా లాభం రాలేదు.. ఇసుక ధర మాత్రం డబుల్ అయిందన్నారు. ఇక, బెల్టు షాపులకు ఎమ్మెల్యేలు మళ్లీ వేలం వేయిస్తున్నారు.. ఇసుక, మద్యం, ఫ్లయాష్, క్వార్జ్.. అన్ని మాఫియామయమే.. మండల స్థాయిలో పేకాట క్లబ్ లు వచ్చేశాయని ఆరోపించారు. ఏ పని జరగాలన్నా.. ఎమ్మెల్యేలకు వాటా ఇవ్వాల్సిందే.. ఆ ఎమ్మెల్యేలు అందులో కొంత వాటాను.. పెదబాబు, చినబాబు, దత్తపుత్రుడికి ఇంత అని ఇస్తున్నారంటూ సెటైర్లే వేశారు. నటనలో ఎన్టీఆర్ కంటే ఎక్కువ నటిస్తున్న చంద్రబాబుకు అవార్డులు ఇవ్వాలి.. చంద్రబాబును నమ్మొద్దని నేను ప్రచారంలో చెప్పినా.. ప్రజలు వినకుండా మోసపోయారని మాజీ సీఎం జగన్ అన్నారు.