Site icon NTV Telugu

Chandrababu Naidu: 21, 22 తేదీల్లో వరదప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

Chandra1

Chandra1

ఏపీలో భారీవర్షాలు, గోదావరి వరదలతో ఏపీలో పరిస్థితి దయనీయంగా మారింది. వరదలతో లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) . ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గాల్లో తిరిగితే సీఎం జగనుకు ప్రజల వరద కష్టాలు ఏం తెలుస్తాయి. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే కాలికి బురద అంటకుండా హెలికాప్టరులో సీఎం జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

Railway Police Save Life: ప్రాణాలు పోయేవి.. వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు

వరదపై ప్రభుత్వ సన్నద్ధత అసలేం లేదు.. బాధితులకు సాయమూ లేదు..! నాలుగు రోజుల పాటు ప్రజలకు భోజనం, నీళ్లు ఇవ్వలేరా? పోలవరం కాఫర్ డ్యాం ఎత్తుపై ఇప్పుడు కొత్త డ్రామాలు.. మూడేళ్లు ఏం చేశారు..? వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని బాబు పిలుపునిచ్చారు. విపత్తుల సమయంలో ఆయా ప్రాంతాల్లో మంత్రులు గాని, ఇతర ప్రభుత్వ పెద్దలు గాని నిరంతరం పర్యవేక్షించే పరిస్థితి ఉండాలి. అయితే ఈ ప్రభుత్వంలో అదేమీ లేదు. జగన్ వరదలపై నాన్ సీరియస్ గా ఉండడం వల్లే కెబినెట్, ఇతర యంత్రాంగం కూడా అలాగే వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తెలుగు దేశం పార్టీ బాధితుల్ని ఆదుకుంటుందని చంద్రబాబు తెలిపారు.మరోవైపు వరదలు రావడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఇటు వైపు కన్నెత్తి చూడక పోవడం దురదృష్టకరం అంటున్నారు కూనవరం మండలం కాచవరం గ్రామ వరద బాధితులు.

ఇటు కోనసీమ జిల్లాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తోడుకుంటూ అక్కడే ఉంటున్నారు లంక వాసులు. తమ వ్యక్తిగత ఇబ్బందులతో మహిళలు అవస్థలు అన్నీ ఇన్నీకావు. కాలనీ చుట్టూ నీరు, ఎటు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంటి బయట కాలు పెట్టలేని స్థితిలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు జనాలు. జ్వరాలతో బాధ పడుతున్నారు చిన్నారులు. వరద ఉధృతి మరింత పెరిగితే ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
Bundelkhand Expressway: బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ

Exit mobile version