తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా పర్యాటనలో అపశృతి చోటు చేసుకుంది.. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు.. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.. మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నీటిలో పడిపోయారు.. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు.. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.. నీటిలో పడినవారిలో పోలీసు అధికారులు, మీడియా సిబ్బంది కూడా ఉన్నారు.. అయితే, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.. అందరూ సురక్షితంగా ఉన్నారు.. మానేపల్లిలో వరద ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది..
కాగా, చంద్రబాబు, ఆయన సిబ్బంది అప్పటికు వెళ్లిన బోటులో ముందే ఒడ్డుకు చేరుకున్నారు.. మాజీ మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర నేతలు.. పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు వస్తున్న బోటు మాత్రం ప్రమాదానికి గురైంది.. అదు కూడా ఒడ్డుకు చేరుకున్న సమయంలో ప్రమాదం జరగడం.. గోదావరిలో వరద ఉధృతి లేకపోవడం.. ఆ ప్రాంతం లోతుగా లేకపోవడంతో.. భారీ ప్రమాదం తప్పింది.. ఈ ఘటనలో నేతలంతా సురక్షితంగా బయటపడ్డారు. పంటు, బోటు ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు.