NTV Telugu Site icon

Chandrababu: ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Babu

Babu

Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. దీంతో పాటు సీఎంకు సంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి, అరకు కాఫీ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరాం తాతయ్య తదితరులు పాల్గొన్నారు.

Read Also: Bangladesh: మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపే 16 మంది వీరే..విద్యార్థి నాయకులకు చోటు

ఇక, గిరిజన తెనేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు..? మార్కెటింగ్ ఎలా ఉంటుందని గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులకు సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంచార జాతియైన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇళ్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.?

కాగా, గిరిజనుల సాగు చేసే తృణధాన్యాల వివరాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు.. ఎంత మేర ఆదాయం వస్తుందని గిరిజనులను అడిగారు.. నన్నారి షర్బత్ వంటివి శ్రీశైలం ప్రాంతంలోని చెంచులే చేస్తారని గుర్తు చేసుకున్నారు. గిరిజనులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. కొన్ని రకాల గిరిజన ఉత్పత్తులకు ఫైవ్ స్టార్ హోటళ్లల్లో మంచి డిమాండ్ ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు.