Site icon NTV Telugu

Chain snatchers: అనంతపురంలో దారుణం.. ముగ్గు వేస్తున్న మహిళపై కత్తి దాడి..

Untitled 4

Untitled 4

Anantapur: ప్రస్తుతం చైన్ స్నాచర్లు రెచ్చి పోతున్నారు.. బంగారం కోసం విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు బంగారం ధరించి పోవాలంటేనే మహిళలు హడలిపోతున్నారు. అయితే ఇప్పటి వరకు బయట ఎక్కడైనా బస్ స్టాప్ లలో.. ఎవరు లేని నిర్మానుష్య ప్రదేశాల్లో మహిళలు బంగారం ధరించి వెళ్లాలంటే భయపడేవారు. ఇక పైన బంగారం ధరించి ఇంటి ముందు ముగ్గు వెయ్యాలాయన్న మహిళలు ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళపైన కొందరు దుండగులు బంగారం కోసం దాడి చేసారు. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

Read also:Vladimir Putin: మాకు భర్తలు, కొడుకులు కావాలి, యుద్ధం కాదు; పుతిన్ కి వ్యతిరేకంగా సైనికుల భార్యలు

వివరాలలోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని తాడిపత్రి పట్టణం లోని కాల్వగడ్డ వీధిలో చైన్ స్నాచర్లు రెచ్చి పోయారు. కాల్వగడ్డ వీధిలో రమాదేవి, వెంకట రామిరెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎప్పట్లాగే రమాదేవి ఇంటి ముందర ముగ్గు వేస్తున్న సమయంలో కొందరు దుండగులు ఆమె పైన కత్తితో దడి చేసారు. ఈ దాడిలో ఆమె గొంతుకు గాయమైంది. కాగా దుండగులు ఆమె మేడలో ధరించి ఉన్న 35 గ్రాముల బంగారు గొలుసు లాకెళ్లారు. కాగా దుండగులు చేస్తున్న దొంగతనాన్ని రమాదేవి భర్త వెంకట రామిరెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన పైన ఓ దుండగుడు కత్తితో దాడిచేసాడు. ఈ దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వాళ్ళను ఆసుపత్రిలో చేర్పించారు. కాగా ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version