Site icon NTV Telugu

Central Minister Narayana Swamy: ఎస్సీఎస్టీలకు కేంద్ర పథకాల అమలుపై సమీక్ష

Naraynaswamy Modi

Naraynaswamy Modi

ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర పథకాల అమలుపై ఏపీ సెక్రటేరీయేట్టులో కేంద్ర సహాయమంత్రి నారాయణ స్వామి సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం కొన్ని కేంద్ర పథకాలను మాత్రమే అమలు చేస్తోంది.కొన్ని పథకాలకు సంబంధించి ఏపీ ప్రతిపాదనలే పంపలేదు.నిధులిస్తామన్నా తీసుకోవడానికి ఏపీకున్న అభ్యంతరం ఏంటీ..?ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇప్పటికీ ఏపీలో ఇవ్వలేదు.కేంద్ర పథకాల అమలు విషయంలో నాకు కొంత అసంతృప్తి కలిగింది.గృహ నిర్మాణం సహా కొన్ని పథకాలకి సంబంధించిన సమాచారం ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు.

Read Also: Russia School Shooting: రష్యా స్కూల్ కాల్పుల్లో 13 మంది మృతి..

జల్ జీవన్ మిషన్ అమలూ సరిగా లేదు.కేంద్ర పథకాల అమలు రాష్ట్రాల్లో ఎలా జరుగుతుందో సమీక్షించే అధికారం మాకుంటుంది.ప్రధానికి పార్టీ ఏంటీ..? ప్రధాని అంటే దేశానికి ప్రధానిగానే చూడాలి.మూడు రాజధానుల విషయంలో గతంలోనే చెప్పాను.. మేం చేసే అభివృద్ధి ఆగదు.ఏ. కొండూరులో కిడ్ని వ్యాధులు రావడానికి కారణాలేంటనే దానిపై ఐసీఎంఆర్ రిపోర్ట్ అడిగాను.ఏ. కొండూరులో గిరిజనులకే కిడ్ని సమస్యలు ఎందుకొస్తున్నాయన్నది పరిశీలించాలని సూచించానన్నారు. ఏ. కొండూరులో రక్షిత తాగు నీటిని మరో రెండు నెలల్లో అందిస్తామని అధికారులు చెప్పారు.

మంగళగిరి AIIMS కు తాగు నీటి సమస్య లేకుండా తాత్కాలికంగా మంగళగిరి మున్సిపాల్టీ నీటి సరఫరా చేస్తోంది. సర్ఫేస్ లేక్ ద్వారా ఎయిమ్సుకు నీటి సరఫరా చేసి.. శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నరేగా కన్వర్జెన్స్ సరిగా చేయడం లేదు. ఇన్కమ్ జనరేటెడ్ స్కీమ్స్ అమల్లో ఏపీ మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర సహాయమంత్రి నారాయణ స్వామి.

Read Also: Russia School Shooting: రష్యా స్కూల్ కాల్పుల్లో 13 మంది మృతి..

Exit mobile version