Site icon NTV Telugu

Andhra Pradesh: ఏపీలో అప్పుల వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Andhra Pradesh Debts

Andhra Pradesh Debts

Andhra Pradesh: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సమాధానం ఇచ్చింది. ఏపీలో అప్పుల భారం ఏటా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లుగా ఉందని.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.3.98 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత మూడేళ్లుగా ఏపీలో అప్పుల భారం పెరుగుతోందని వివరించింది. 2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3 శాతంగా ఉంటే… 2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని కేంద్రం చెప్పింది.

Read Also: Bigg Boss 7: బాలయ్యతో ‘బిగ్‌బాస్ 7’?

2015లో ఏపీ జీడీపీలో 23.3 శాతం అప్పులు ఉన్నాయని, కానీ 2021కి వచ్చేసరికి రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 36.5 శాతంగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ తన సమాధానంలో వెల్లడించింది. 2017-18లో 9.8 శాతం అప్పులు తగ్గాయని, కానీ 2020-21 నాటికి అప్పుల పెరుగుదల 17.1 శాతంగా ఉందని వివరించింది. అటు విభజన చట్టంలోని హామీల మేరకు ఇప్పటి వరకూ ఏపీకి రూ.23,110.47 కోట్లు ఆర్థిక సాయం చేశామని కేంద్రం ప్రకటించింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5617.89 కోట్లు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.1750 కోట్లు, రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 13,226.772 కోట్లు ఏపీకి ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Exit mobile version