Andhra Pradesh Special Status: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. కేంద్రం మరోసారి స్పష్టీకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Special Status: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ పాత విషయాలనే ప్రస్తావించింది. ఏపీకి ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని మరోసారి లోక్‌సభలో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు. ఏపీకే కాకుండా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థికసంఘం ప్రాధాన్యత ఇవ్వలేదని నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించినట్లు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వెల్లడించారు.
Read Also: Minister Ambati Rambabu: పోలవరం ఎత్తుపై వివాదం మంచిది కాదు
Also Read
అటు ప్రత్యేకహోదా అంశంపై 15వ ఆర్ధిక సంఘం కూడా ఇవే సిఫారసులను చేసిందని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే విభజన చట్టం హామీలను చాలావరకు నెరవేర్చామని ఆయన వివరించారు. ఇంకా విభజన చట్టంలోని కొన్ని హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలోనే నెరవేరుస్తామని పేర్కొన్నారు. విభజన సమస్యలపై వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాలతో ఇప్పటిదాకా 28 సార్లు సమావేశమైనట్లు నిత్యానందరాయ్ తెలిపారు. కాగా తాము అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను సాధిస్తామని 2019 ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కేంద్రానికి తమ అవసరం లేనందున డిమాండ్ చేయలేమని.. కానీ ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!