YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎంఆర్ షా.. అయితే, తులశమ్మ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో నివేదిక అందజేసింది సీబీఐ.. రాంసింగ్ తో పాటు మరోకరు పేరును సీబీఐ సూచించింది.. కాగా, రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు న్యాయమూర్తి ఎం ఆర్ షా.. దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదని వ్యాఖ్యానించారు..
Read Also: Wayanad Bypoll: వయనాడ్ ఉపఎన్నికపై స్పందించిన సీఈసీ.. అప్పుడే ఎన్నికలు!
మరోవైపు, విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5గా ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని కోరారు తులశమ్మ.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది సుప్రీంకోర్టు.. ఈ కేసులో మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది.. ఇక, ఏప్రిల్ 15వ తేదీకల్లా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలియజేసింది సీబీఐ. అయితే, కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలల సమయం అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాల్సింది తులశమ్మ తరపు న్యాయవాది విన్నవించారు. అయితే, ఈ కేసులో మధ్యాహ్నం సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది ఉత్కంఠగా మారింది.