వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకా హత్య కేసులో విస్తృత కుట్ర కోణాన్ని బయటపెట్టాలని, ఏప్రిల్ 30లోపు దర్యాప్తు ముగించాలని ఆదేశించింది జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం. కొత్త సిట్ ని ఏర్పాటు చేస్తూ… సుప్రీంకోర్టు ముందు ప్రతిపాదన పెట్టింది సిబిఐ. కొత్త సిట్‌లో ఎస్పి వికాస్ సింగ్, అడిషనల్ ఎస్పీ ముకేష్ కుమార్, ఇన్స్పెకర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ ఇన్స్పెక్టర్ అంకిత్ యాదవ్ ఉన్నారు. సిబిఐ డిఐజి కేఆర్ చౌరాసియా నేతృత్వంలో కొత్త సిట్ పని చేస్తుందని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.
Read Also:Ajit Doval: చైనాను ఉద్దేశించి అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు..
వివేకా హత్యకేసు దర్యాప్తు నుంచి ప్రస్తుత దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను తప్పించింది సిబిఐ. ఆరు నెలలలోపు ట్రయల్ మొదలుకాక పోతే… సాధారణ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన నివేదికను పరిగణలోకి తీసుకుంటాం అని దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలో దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని సీబీఐ స్పష్టం చేసింది. అలాగే అదనపు ఛార్జ్ షీట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఈ కేసులో నిందితునిగా ఉన్న శివశంకర్ భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణలో భాగంగా సీబీఐ దర్యాప్తుపై కోర్టు సీబీఐ దర్యాప్తు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తులో విచారణ అధికారిని మార్చాలని లేదా మరో అధికారిని నియమించాలని గత విచారణలో ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ విచారణ అధికారిని మార్చింది.
Read Also: Vishwak Sen: డైరెక్షన్‌కి విశ్వక్ సేన్ గుడ్ బై..?