NTV Telugu Site icon

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి అరెస్ట్..!

Ys Viveka

Ys Viveka

YS Viveka Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది.. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ లో పులివెందులకు చెందిన కీలక వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.. ఆ తర్వాత హైదరాబాద్ కు తరలించారు.. వివేకా హత్య కేసులో ఉదయ్‌ కుమార్‌ను విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన మృతదేహానికి కుట్లు వేసి, కట్లు గట్టిన ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే జయప్రకాష్ రెడ్డి కుమారుడు యూసీఎల్ ఉద్యోగి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. అయితే, ఈ కేసులో నోటీసులు జారీ చేసిన సీబీఐ అధికారులు.. ఆ తర్వాత స్టేట్‌మెంట్‌ రికార్డు చేవారు.. పులివెందుల నుంచి సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ రెడ్డిని కడపకు తీసుకెళ్లారు.. సుమారు గంటన్నర తర్వాత ఉదయ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు ఉదయ్ కుమార్ తరపు లాయర్ జయప్రకాష్ రెడ్డికి తెలియజేశారు.

Read Also: CM YS Jagan: బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్‌.. దేశం గర్వించదగ్గ మేధావి

హత్య జరగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సీబీఐ సేకరించిన గూగుల్ టేక్ ఔట్ లో ఉదయ్ కుమార్ వివరాలు కూడా వెల్లడి కావడంతో ఇప్పుడు సీబీఐ అధికారులు ఉదయ్ కుమార్ అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది.. గతంలో సీబీఐ విచారణ పేరుతో తనని వేధిస్తోందని ఉదయ్ కుమార్.. కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కడప కోర్టులో ప్రైవేట్ కేసు కూడా దాఖలు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన 15 మందితో కూడిన సీబీఐ బృందం రెండు, మూడు రోజులుగా కడపలో ఉంటూ సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకా కేసులో సీబీఐ దూకుడు పెంచింది.

Show comments