NTV Telugu Site icon

Chandrababu: చంద్రబాబుపై కేసు.. మరో ఆరుగురు టీడీపీ నేతలపై కూడా

Chandrababu

Chandrababu

Chandrababu: తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేశారు పోలీసులు.. బిక్కవోలు పోలీసు స్టేషన్‌లో చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసులు పెట్టారు.. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు షో నిర్వహించి, పోలీసులపై దురుసుగా మాట్లాడి, దూషించడంపై డీఎస్పీ ఫిర్యాదు చేయగా.. సెక్ష న్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేశారు బిక్కవోలు పోలీసులు.. కాగా, బలభద్రపురం నుంచి అనపర్తి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేశారు.. హింసను ప్రోత్సహించారని.. పోలీసులపై తిరగబడ్డారంటూ కేసులు నమోదు చేశారు.

Read Also: Sridevi Shoban Babu Movie Review: శ్రీదేవి శోభన్ బాబు రివ్యూ

చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదు అయ్యాయి. ఫోటోలు, వీడియోలు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ లో టీడీపీ ముఖ్య నేతల పేర్లను పోలీసులు చేర్చినట్టుగా తెలుస్తోంది.. ఇక, చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలకు అనుమతిలేకున్నా నిర్వహించటంపైన కేసులు నమోదు అయ్యాయి. బిక్కవోలుతో పాటు అనపర్తి పోలీస్‌ స్టేషన్‌లోనూ టీడీపీ నేతలపై కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చారని, కానీ, అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారన్నారు. అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులపై న్యాయబద్ధంగా పోరాడుదామని ధైర్యాన్ని చెప్పారు.

Show comments